Fire Accident: ప్రకాశం జిల్లాలో టిప్పర్ లారీకి మంటలు.. రహదారిపైనే దగ్ధం

ప్రకాశం జిల్లా జాతీయ రహదారిపై ఓ టిప్పర్ లారీ దగ్ధమైంది. చీమకుర్తి నుంచి నెల్లూరు జిల్లా రామయ్య పట్నం కోర్టుకు బండరాళ్లను రవాణా చేస్తున్న లారీ అగ్నికి ఆహుతి అయింది. అధిక లోడు కారణంగా లారీ షార్ట్ కట్ సర్క్యూట్ అయినట్లు తెలుస్తోంది. టోల్ ప్లాజా సమీపంలో ఈ ప్రమాదం జరగడంతో సిబ్బంది, వాహనచోదకులు భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు.

Published : 19 Feb 2023 10:52 IST

Fire Accident: ప్రకాశం జిల్లాలో టిప్పర్ లారీకి మంటలు.. రహదారిపైనే దగ్ధం

Tags :

మరిన్ని