Tirumala: తిరుమల శ్రీవారి ఆలయం.. ఫల, పుష్ప శోభితం

తిరుమల శ్రీవారి ఆలయంలో శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఫల, పుష్ప అలంక‌ర‌ణ‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తితిదే ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో పది టన్నుల పూలు, ఫలాలను వినియోగించి అలంకరణలు చేపట్టారు. ఆలయం లోపల యాపిల్‌, ద్రాక్ష, బత్తాయి, సపోటా, నారింజ, కర్బూజ, మామిడి, చెరకు వంటి విభిన్న రకాల పండ్ల గుత్తులు, సంప్రదాయ పుష్పాలతో సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయం ఎదుట వివిధ రకాల పుష్పాలతో అశ్వాలు, త్రేత‌, ద్వాప‌ర‌, క‌లియుగాల‌కు సంబంధించిన వివిధ ఘట్టాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Published : 22 Mar 2023 13:08 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు