Kodandaram: కేసీఆర్‌ సర్కారు అరాచకాలపై ఐక్యంగా ఉద్యమిస్తాం: కోదండరామ్‌

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం ఇద్దరు వ్యక్తుల సమస్య కాదని.. అందులో పాలకులకు సంబంధం ఉందని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పేర్కొన్నారు. లీకేజీ ఘటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాల్సిందేనని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ సర్కారు 30లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆరోపించారు. ప్రభుత్వ అరాచకాలపై ఐక్యంగా ఉద్యమిస్తామని ప్రకటించారు. ‘కేసీఆర్ పైసా గెలుస్తుందా? మా పోరాట పటిమ గెలుస్తుందా? చూద్దాం’ అని సవాలు చేశారు.

Published : 21 Mar 2023 15:37 IST

మరిన్ని