Congress: ఇదే నా ఆహ్వానం.. తిరిగి వచ్చేయండి: రేవంత్‌ రెడ్డి

కర్ణాటక ప్రజల తీర్పును ప్రపంచమంతా స్వాగతిస్తుంటే.. ఆ ఫలితాలను పట్టించుకోవాల్సిన పనిలేదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. ఈ మేరకు భాజపా- భారాస, మోదీ - కేసీఆర్‌ వేర్వేరు కాదని మండిపడ్డారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ (Congress) అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ‘‘ఆ నేతలకు భాజపా సిద్ధాంతాలతో సంబంధం లేదు. వివేక్‌, విశ్వేశ్వర రెడ్డి, రాజగోపాల్‌ రెడ్డి, ఈటల, జూపల్లి, పొంగులేటి లాంటి నేతలందరికీ ఇదే నా ఆహ్వానం.. కాంగ్రెస్‌లోకి రండి. అవసరమైతే పార్టీ కోసం 10 మెట్లు కిందకు దిగుతా. కలిసి పనిచేద్దాం’’ అని రేవంత్‌ కోరారు.

Updated : 18 May 2023 18:02 IST

Tags :

మరిన్ని