ఇంజిన్‌లో సాంకేతిక లోపం.. పొలాల్లో శిక్షణ విమానం ల్యాండింగ్‌

కర్ణాటక (Karnataka) బెళగావిలో శిక్షణ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలెట్లు అప్రమత్తమై విమానాన్ని ల్యాండ్ చేశారు. బెళగావిలోని సంబ్రా విమానాశ్రయానికి సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఇద్దరు పైలెట్లకు స్వల్ప గాయాలయ్యాయి. పొలాల్లో విమానం దిగడంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. విమానం రెడ్ బర్డ్ ఏవియేషన్‌కు చెందినదిగా అధికారులు గుర్తించారు. 

Published : 30 May 2023 19:47 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు