TS Police: ఎస్సై, కానిస్టేబుల్‌ తుది రాత పరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్‌ తుది రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో మొత్తం 84 శాతం అభ్యర్థులు అర్హత సాధించినట్లు బోర్డు వెల్లడించింది. మంగళవారం రాత్రి నుంచి అభ్యర్థులు సాధించిన మార్కులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత.. క్యాస్ట్ కెటగిరీ ప్రకారం కటాఫ్ మార్కులను నిర్ణయిస్తారు. ఆపై మెడికల్ టెస్టుల అనంతరం ఎస్బీ ఎంక్వరీ చేసి.. క్రిమినల్ కేసులు ఉన్నవారిని అనర్హులుగా పరిగణిస్తారు. మరోమారు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం తుది ఫలితాలను వెల్లడిస్తారు.

Updated : 30 May 2023 20:34 IST

మరిన్ని