TSRTC: వైఫైతో టీఎస్‌ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులు.. సౌలతులు సూపర్‌!

ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు టీఎస్‌ఆర్టీసీ మొదటిసారిగా ఏసీ స్లీపర్ బస్సుల (TSRTC AC Sleeper Buses)ను ప్రారంభించనుంది. ప్రైవేట్ బస్సులకు ధీటుగా అన్ని హంగులతో తీర్చిదిద్దిన 16 బస్సులు మార్చిలో అందుబాటులోకి రానున్నాయి. లహరి పేరుతోనే రానున్న ఈ బస్సులు బెంగుళూరు, హుబ్లీ, విశాఖపట్నం, తిరుపతి, చెన్నై మార్గాల్లో తిరగనున్నాయి. హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో నమూనా బస్సును పరిశీలించిన సంస్థ ఎండీ సజ్జనార్.. 30 బెర్తులున్న ఈ బస్సుల్లో మొబైల్ ఛార్జింగ్, వైఫై వంటి పూర్తి సదుపాయాలు కల్పించామని తెలిపారు. ప్రయాణికుల భద్రత కోసం సీసీ కెమెరాలతో పాటు కంట్రోల్ రూమ్‌తో అనుసంధానమైన ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు.

Updated : 20 Feb 2023 19:30 IST

Tags :

మరిన్ని