TTD Kalyanamasthu Scheme: ఏపీలో కొండెక్కిన కల్యాణమస్తు కార్యక్రమం

నిరుపేద కుటుంబాలకు.. తన పిల్లల పెళ్లి ఆర్థిక భారం కాకూడదన్న ఉద్దేశంతో తిరుమల తిరుమతి దేవస్థానం చేపట్టిన ఉచిత సామూహిక వివాహాల కార్యక్రమం కల్యాణమస్తు అటకెక్కింది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన తితిదే చివరి నిమిషంలో విరమించుకుంది. ఆ తర్వాత దాని ఊసే మరచింది. నిరుపేదలకు, సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్న తితిదే.. కల్యాణమస్తు కార్యక్రమాన్ని నిర్వహించకపోవటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Published : 14 May 2023 10:51 IST

Tags :

మరిన్ని