Earthquake: ‘దేవుడినే ప్రార్థిస్తూ గడిపాం’.. కంటతడి పెట్టించిన చిన్నారి జిహాన్‌!

తుర్కియేలో శిథిలాల కింద తమ్ముడిని కాపాడేందుకు తన చేతిని అడ్డుపెట్టి.. అతడికి ధైర్యం చెబుతూ కాపాడిన ఐదేళ్ల జిహాన్ గుర్తుంది కదా. ఇప్పుడు ఆ చిన్నారి, ఆమె తమ్ముడు అబ్డో సురక్షితంగా ఉన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాటి చేదు జ్ఞాపకాల నుంచి బయట పడుతున్నారు. భవన శిథిలాల నుంచి తమను బయటకు తీస్తే.. మీ ఇంట్లో పనిమనిషిగా అయినా మారుతానంటూ ఆ చిన్నారి పలికిన మాటలు అందరి చేత కంటతడి పెట్టించాయి. ఇప్పుడు తన ఇల్లు ఎలా కూలిపోయిందో, తాను కటిక చీకట్లలో ఎలా గడిపిందో ఆ చిన్నారి చెప్తుంటే హృదయం ద్రవిస్తోంది.

Published : 12 Feb 2023 16:25 IST

Tags :

మరిన్ని