Viral Video: రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ యువతులు

కేరళలోని కోజికోడ్ జిల్లా మవూర్‌లో ఇద్దరు యువతులు రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. అరీకోడే నుంచి ప్రైవేటు బస్సు బయలుదేరగా.. దాని వెనకే ఇద్దరు యువతులు స్కూటర్‌పై ప్రయాణించారు. మవూర్ వద్ద వారు బస్సును దాటి ముందుకు వెళ్లే ప్రయత్నం చేయగా.. అదే సమయంలో ఎదురుగా ట్రాలీ ఆటో వచ్చింది. ట్రాలీ ఆటోకు, బస్సుకు మధ్య స్కూటర్ చిక్కుకోగా.. వారిద్దరూ కింద పడిపోయారు. ఆ సమయంలో బస్సు, ఆటో వేగంతో పాటు స్కూటర్ వేగం తక్కువగా ఉండడంతో.. యువతులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ప్రైవేటు బస్సుకు అమర్చిన సీసీటీవీల్లో ఈ దృశ్యాలు నమోదయ్యాయి.

Published : 07 Jun 2023 20:22 IST

మరిన్ని