Union Budget 2023: రైతుల ఆదాయం రెట్టింపు.. ఈ బడ్జెట్‌లో నెరవేరుతుందా?

దేశ ప్రజల ఆహార అవసరాలను తీర్చేది వ్యవసాయ రంగం. అంతటి ఈ కీలక రంగానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బడ్జెట్‌లలో కేటాయింపులు చేస్తున్నా.. ఫలితాలు మాత్రం ఆశించిన మేర రావడం లేదు. కరోనా, ఆర్థిక మాంద్యం, ఉద్యోగాల కోతలతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న పరిస్థితుల్లో వ్యవసాయ రంగంపై కూడా దాని ప్రభావం పడింది. ఈ ప్రతికూల సమయంలో సాగు రంగానికి సంబంధించి  2023-24 బడ్జెట్‌పై ఎన్నో ఆశలు ఉన్నాయి. వ్యవసాయం దాని అనుబంధ రంగాలు కూడా ఈ బడ్జెట్‌పై కోటి ఆశలు పెట్టుకున్నాయి. మరి, వీరందరి ఆశలను పదిలం చేసేలా నిర్మలమ్మ పద్దు ఉంటుందా? 

Published : 01 Feb 2023 09:48 IST

Tags :

మరిన్ని