Unstoppable: పెళ్లి గురించి బాలకృష్ణ ప్రశ్న.. ప్రభాస్‌ సమాధానం ఏంటో తెలుసా?

హైదరాబాద్‌: బాలకృష్ణ(Balakrishna) వ్యాఖ్యాతగా ‘ఆహా’ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌విత్‌ ఎన్‌బీకే’. ఇప్పటికే ఎంతోమంది సినీ, రాజకీయ సెలబ్రిటీలు ఈ షోలో సందడి చేశారు. తాజాగా ఈ షోకు పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas), మాచో స్టార్‌ గోపిచంద్‌ (Gopi chand) వచ్చి సందడి చేశారు. బాలకృష్ణ ప్రశ్నలకు ప్రభాస్‌ ఇస్తున్న సమాధానం, ఇద్దరూ కలిసి చేసిన హంగామా చూస్తే ‘వావ్‌’ అనిపించేలా ఉంది. పెళ్లెప్పుడు అని శర్వాను అడిగితే ‘ప్రభాస్‌ తర్వాత అన్నాడు’ మరి నీ సమాధానం ఏంటి అని బాలకృష్ణ అడగ్గా ‘నేను సల్మాన్‌ తర్వాత అని చెప్పాలేమో’ అని ప్రభాస్‌ చెప్పడంతో నవ్వులు పూశాయి.  ఇక గోపిచంద్‌ రాకతో ఆ సందడి రెట్టింపైంది. నూతన సంవత్సరం కానుకగా డిసెంబరు 30 నుంచి ఆహా వేదికగా ఈ ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ కానుంది.

Updated : 17 Dec 2022 18:47 IST

Tags :

మరిన్ని