Taiwan: తైవాన్‌ను ఏకాకి చేస్తానంటే ఊరుకోం: పెలోసీ

చైనా హెచ్చరికలు బేఖాతరు చేస్తూ తైవాన్ పర్యటనను విజయవంతంగా ముగించిన అమెరికా ప్రతినిధులసభ స్పీకర్ నాన్సీ పెలోసీ మరోసారి డ్రాగన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. అమెరికా అధికారులను తైవాన్‌కు వెళ్లకుండా చైనా అడ్డుకోలేదన్నారు. ఆ దేశాన్ని ఏకాకి చేస్తానంటే తాము చూస్తూ ఊరుకోబోమన్నారు. తన పర్యటన ఆ ప్రాంతంలోని యథాతథ స్థితిలో ఎలాంటి మార్పును తీసుకురాదని స్పష్టం చేశారు. తైవాన్‌లో ప్రజాస్వామ్యాన్ని, ఆర్థిక ప్రగతిని పొగిడిన పెలోసీ ఆ దేశానికి తమ సంఘీభావం ఉంటుందని స్పష్టం చేశారు.

Published : 05 Aug 2022 18:55 IST

Tags :

మరిన్ని