America: అమెరికాలో నేడు మధ్యంతర ఎన్నికలు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిష్ఠకు, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజకీయ భవిష్యత్తుకు పరీక్షగా మారిన అమెరికా మధ్యంతర ఎన్నికలకు నేడు ఓటింగ్ జరగనుంది. అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభలో మొత్తం 435 స్థానాలకూ, సెనేట్‌లో మూడోవంతు అంటే 35 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జో బైడెన్ రెండేళ్ల పాలనపై ప్రజాభిప్రాయాన్ని ఈ ఎన్నికల ఫలితాలు ప్రతిబింబించనున్నాయి. ఇప్పటికే 4.20 కోట్ల మంది అమెరికన్లు ముందస్తుగా మధ్యంతర ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Published : 08 Nov 2022 17:00 IST
Tags :

మరిన్ని