BRS: భారాసలో అప్పుడే టికెట్ల లొల్లి.. ఎమ్మెల్యే లింగయ్యకు వీరేశం సవాల్‌

‘‘నాకు టికెట్‌ రాదని చెప్పడం కాదు. నేను భారాస టికెట్ తీసుకోను. నీకు దమ్ముంటే నువ్వు కూడా తీసుకోకు. ఇద్దరం ఇండిపెండెంట్‌గా పోటీ చేద్దాం. గెలిచిన వాళ్లమే మళ్లీ భారాసలో చేరుదాం’’ అంటూ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (MLA Chirumarthi Lingaiah)కు.. నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం సవాల్‌ (Vemula Veeresham) విసిరారు. వీరేశం పుట్టినరోజు వేడుకలు నకిరేకల్‌లో గురువారం ఘనంగా జరిగాయి. శాసనమండలి మాజీ ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్, భారాస నేత కంచర్ల కృష్ణారెడ్డి ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లింగయ్యను ఉద్దేశించి వీరేశం విమర్శలు గుప్పించారు. 

Published : 01 Jun 2023 19:54 IST

మరిన్ని