Bapatla: పోలీస్ స్టేషన్‌కు వచ్చిన యువకుడిపై వేమూరు ఎస్‌ఐ దాష్టీకం

బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం పరిధిలో రెండు వర్గాల యువకుల మధ్య జరిగిన గొడవ పోలీస్ స్టేషన్‌కు చేరింది. షేక్ మహమ్మద్ రఫీ అనే 19 ఏళ్ల యువకుడిపై ఫిర్యాదు వచ్చిందని ఎస్సై అనిల్ కుమార్ అతడి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. స్టేషన్‌కి వచ్చి సానుకూలంగా పరిష్కరించుకోవాలని సూచించారు. అక్కడికి వెళ్లాక ఎస్సై అనిల్ కుమార్ తనపై దాడి చేసినట్లు రఫీ వాపోయాడు. ఆ తర్వాత తన తలపై ఉన్న జుట్టును కత్తితో కత్తిరించాడని కన్నీటి పర్యంతమయ్యాడు. రఫీ భయంతో పరుగులు తీసి కుటుంబ సభ్యులు వద్దకు చేరుకోగా.. అతడిని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Published : 07 Jul 2022 11:16 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని