AP News: కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.. రెవెన్యూ సదస్సు నుంచి గెంటేశారు!

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో.. ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌ రెడ్డి (Mekapati Vikram Reddy) ఆధ్వర్యంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సు ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యేకు తన భూ సమస్యను విన్నవించుకోవడానికి వచ్చిన ఓ బాధితుడికి.. అధికారులు మైక్ ఇవ్వకుండా లాక్కున్నారు. కాళ్లు పట్టుకొని వేడుకున్న కూడా పోలీసులు కనికరించకుండా బయటకు తోసేశారు. వైకాపా నేత శ్రావణ్‌కుమార్‌ తన భూమిని ఆక్రమించి.. రిజిస్ట్రేషన్ చేసుకున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినా.. ఆర్డీవో కరుణకుమారి, తహసీల్దార్ హేమంత్ కుమార్ స్పందించకుండా.. శ్రావణ్ కుమార్ వద్ద లంచాలు తీసుకొని తనకు న్యాయం చేయటం లేదని బాధితుడు వాపోయాడు.

Published : 21 Apr 2023 18:42 IST

Tags :

మరిన్ని