Viral Video: దోశ ఇలా కూడా వేయొచ్చా?.. వీడియో వైరల్‌!

దోశ అంటే ఇప్పటి వరకూ మనం గుండ్రటి ఆకారంలోనే చూసుంటాం. కానీ, తోపుడు బండిపై ఓ వీధి వ్యాపారి వేసే దోశలు చూస్తే ఆ అభిప్రాయం మార్చుకోవాల్సిందే. విభిన్న ఆకృతులతో ఆయన వేస్తున్న దోశలు చూసి సామాన్య ప్రజలతో పాటు బడా వ్యాపారవేత్తలు సైతం ఫిదా అవుతున్నారు. ఆ వ్యాపారి టెడ్డీ బేర్‌ ఆకృతిలో దోశ వేస్తున్న వీడియోను నాంది ఫౌండేషన్‌ సీఈవో మనోజ్‌ కుమార్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. పనికి కళాత్మకతను జోడిస్తున్న అతడి నైపుణ్యాన్ని ప్రశంసించారు. ఈ వీడియోను 3 లక్షల మందికిపైగా వీక్షించారు. పలువురు నెటిజన్లు సైతం అతడిని మెచ్చుకుంటూ పోస్టులు పెడుతున్నారు.  

Updated : 05 Mar 2023 11:46 IST

Tags :

మరిన్ని