సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ దూసుకెళ్తోంది: విజయేంద్ర ప్రసాద్

తన పట్టుదల, అకుంఠిత దీక్షతో అద్భుతమైన దేవాలయాలను, ప్రజా నిర్మాణాలను చేస్తూ.. కృషి ఉంటే మనుషులు రుషులవుతారనే నానుడిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిజం చేస్తున్నారన్నారని రాజ్యసభ సభ్యులు, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) కొనియాడారు. తెలంగాణ కొత్త సచివాలయాన్ని విజయేంద్ర ప్రసాద్ సందర్శించారు. వారసత్వ సాంస్కృతిక వైభవం, ఆధునికతల కలబోతకు నిలువెత్తు నిదర్శనంగా డా.బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయం ఉందన్నారు. అతి తక్కువ సమయంలో అతి తక్కువ బడ్జెట్‌లో.. జనం కోసం ఒక గొప్ప నిర్మాణం చేశారన్నారు. కేసీఆర్‌ (CM KCR) నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తోందని వెల్లడించారు. 

Updated : 19 May 2023 14:02 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు