AP News: గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టిబాబుకు నిరసన సెగ

కోనసీమ జిల్లాలో నిర్వహించిన గడప గడప కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు స్థానికుల నుంచి నిరసన సెగ తగిలింది. అంబాజీపేట మండలం కె.పెదపూడిలో గ్రామంలో అభివృద్ధి చేయడం లేదని ఓ యువకుడు ఎమ్మెల్యేను నిలదీశాడు. సొంత పార్టీ వాళ్లే తమపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఓ మహిళ.. ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరకు తాను ఎవరిపైనా కేసులు పెట్టించడం లేదని ఎమ్మెల్యే సర్దిచెప్పుకోవాల్సి వచ్చింది.

Published : 26 Sep 2022 22:35 IST
Tags :

మరిన్ని