Virat Kohli : ఆ ఓటముల నుంచి పాఠాలు నేర్చుకోవాలి: విరాట్ కోహ్లీ

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసియా కప్‌ను భారత్‌ విజయంతో ముగించింది. అఫ్గాన్‌పై సెంచరీతో విరాట్ కోహ్లీ (122*) చెలరేగాడు. ఈ క్రమంలో మ్యాచ్‌ అనంతరం విరాట్ కోహ్లీని రోహిత్ శర్మ స్పెషల్‌గా ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా విరాట్ మాట్లాడుతూ.. ‘‘ఆసియా కప్‌ చాలా ముఖ్యమైందే. ఇందులో జట్టు యాటిట్యూడ్‌ ఎలా ఉంది అనేది తెలుసుకున్నాం. అయితే మనందరి లక్ష్యం రాబోయే టీ20 ప్రపంచకప్‌. అందుకే ఓడిపోయిన మ్యాచ్‌ల నుంచి పాఠాలను నేర్చుకోవాలి. వ్యక్తిగతంగా అఫ్గాన్‌ మీద కాకుండానే ఈ టోర్నీమెంట్‌ నాకు చాలా కీలకం. బిగ్‌ బ్రేక్‌ తర్వాత జట్టులోకి వచ్చా. అయితే మీ అందరి మద్దతుతో రాణించా’’ అని కోహ్లీ చెప్పిన వీడియో టీజర్‌ను బీసీసీఐ పోస్టు చేసింది. అయితే పూర్తి వీడియో కోసం బీసీసీఐ వెబ్‌సైట్‌కు వెళ్లాల్సిందే.

Published : 09 Sep 2022 14:34 IST
Tags :

మరిన్ని