IND vs SL: విరాట్ బ్యాట్‌ నుంచి ధోనీ స్పెషల్‌ ‘హెలికాప్టర్‌’ షాట్‌

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ స్పెషల్‌ షాట్‌..  ‘హెలికాప్టర్’ సిక్స్‌ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అలాంటి షాట్‌ కొట్టి మరోసారి ధోనీని గుర్తు చేశాడు. విరాట్ దాదాపు 97 మీటర్ల సిక్స్‌ కొట్టి ఆశ్చర్యపరిచాడు. ఇదే మ్యాచ్‌లో సెంచరీ (166 నాటౌట్‌) కొట్టి భారత్‌ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ వీడియోను బీసీసీఐ తన ట్విటర్‌లో పోస్టు చేసింది.

Published : 16 Jan 2023 13:40 IST

మరిన్ని