Andhra News: పింఛన్ అడిగిన మహిళపై వాలంటీర్‌ దాడి

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం పొడరాళ్లలో.. పింఛన్ అడిగిన రమాదేవి అనే మహిళపై.. మహిళా వాలంటీర్ దాడికి దిగింది. ఒకటో తేదీన ఇవ్వాల్సిన పింఛన్ మూడో తేదీ దాటినా ఇవ్వకపోవడంతో తాను వాలంటీర్  ఇంటికి వెళ్లి ప్రశ్నించానని బాధితురాలు రమాదేవి చెబుతున్నారు.  తెలుగుదేశం పార్టీకి చెందిన నీకు పింఛన్ ఇచ్చేది లేదంటూ మరికొంత మందితో కలిసి వాలంటీర్ దాడికి దిగిందని బాధితురాలు ఆరోపించారు. 

Published : 04 Jul 2022 10:06 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని