VRA Protest: మాకు పే స్కేలు కావాలి! : ఉప్పల్‌ మ్యాచ్‌లో ఫ్లెక్సీ ప్రదర్శన

ఉప్పల్‌ మైదానంలో జరిగిన ఆస్ట్రేలియా-భారత్‌ ట్వంటీ 20 క్రికెట్‌ మ్యాచ్‌లో ఒకవైపు సిక్స్‌లు.. ఫోర్లు కావాలనే ఫ్లెక్సీలు.. ఆటగాళ్ల వీరబాదుడుకు అభిమానులు జాతీయ జెండాలు ఊపుతూ కనిపిస్తే.. వారి మధ్యలో ఒక వ్యక్తి మాత్రం ‘వియ్‌ వాంట్‌ పే స్కేల్‌..’అనే బోర్డు పట్టుకున్నాడు. ముఖంపై జాతీయ జెండా టాటూలు వేసుకుని వీఆర్‌ఏల సమస్యతో పాటు ఆటలోని మజాను ఆస్వాదిస్తూ కనిపించాడు. ఇంతకూ ఆయన ఎవరని ఆరాతీస్తే ఖమ్మం గ్రామీణ మండలానికి చెందిన వీఆర్‌ఏ అజయ్‌ అని తెలిసింది. మొత్తానికి గ్రౌండ్‌ అంతా ఆటలో మునిగిపోగా ఆ యువకుడు మాత్రం ఆటతో పాటు తమ సమస్యను కూడా లోకానికి.. ప్రభుత్వానికి చాటాలని ప్రయత్నించాడు.

Published : 26 Sep 2022 11:14 IST

Tags :

మరిన్ని