Warangal: సర్వాంగ సుందరగా ఓరుగల్లు.. విద్యుత్‌ దీపాలతో ధగధగ

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల (Telangana State Formation Day)కు ఓరుగల్లు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు ఉదయం జాతీయ జెండా ఎగరేసి వేడుకల్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఉత్సవాల సందర్భంగా.. నగరం విద్యుత్ దీప కాంతులతో దేదీప్యమానమైంది. హనుమకొండ కలెక్టరేట్, వరంగల్ కలెక్టరేట్, జిల్లా పరిషత్ కార్యాలయం, ఎన్పీడీసీఎల్ కార్యాలయంతోపాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలు పార్కులు.. దీపాలతో ధగధగ లాడుతూ శోభాయమానంగా నిలిచాయి.

Published : 01 Jun 2023 21:11 IST

Tags :

మరిన్ని