Maharashtra: వాట్సప్‌ స్టేటస్‌ రేపిన చిచ్చు.. కొల్హాపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత

వివాదాస్పద వాట్సప్ స్టేటస్‌కు వ్యతిరేకంగా.. హిందూ సంస్థలు చేపట్టిన ఆందోళన మహారాష్ట్ర కొల్హాపూర్‌లో ఉద్రిక్తతకు దారితీసింది. హిందూ సంస్థలు నగరంలో బంద్‌కు పిలుపునివ్వగా.. పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. ఈ నెల 19 వరకూ కర్ఫ్యూ విధించారు. అయినప్పటికీ పెద్దసంఖ్యలో కార్యకర్తలు శివాజీ మహరాజ్‌ చౌక్‌ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ప్రస్తుతం కొల్హాపూర్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారగా పెద్దసంఖ్యలో బలగాలను మోహరించారు.

Published : 07 Jun 2023 15:23 IST

Tags :

మరిన్ని