Kurnool: ఇంట్లోనే భర్త శవానికి దహనసంస్కారాలు చేసిన భార్య

మృతి చెందిన భర్తకు ఇంట్లోనే భార్య దహన సంస్కారాలు నిర్వహించింది. ఈ సంఘటన కర్నూలు (Kurnool) జిల్లా పత్తికొండ పట్టణంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం హరికృష్ణప్రసాద్‌ అనే వ్యక్తి ఇంటి నుంచి పొగలు రావడాన్ని గమనించిన కాలనీ వాసులు.. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతుడి భార్య లలితతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు.

Published : 29 May 2023 15:02 IST

మరిన్ని