ప్రభుత్వ సాయం రూ.5 లక్షల్లో వాటా ఇవ్వనందుకే మంత్రి రాంబాబుకు మాపై కక్ష: మహిళ ఆవేదన

పల్నాడు జిల్లాలో సత్తెనపల్లిలో మృతి చెందిన తమ కుమారుడి పేరిట మంజూరైన రూ.5 లక్షల ఆర్థికసాయాన్ని వెంటనే ఇప్పించాలని మంత్రి అంబటి రాంబాబును మృతుడు అనిల్ తల్లిదండ్రులు కోరారు. మంత్రి రాంబాబుపై తమకు ఎలాంటి కోపం, కక్ష లేవని మృతుడు అనిల్ తల్లి గంగమ్మ చెప్పారు. తమకు ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులో.. మంత్రి రాంబాబు రూ.2.5 లక్షలు అడిగితే ఇవ్వనందుకే తమకు చెక్కు అందకుండా చేశారని ఆరోపించారు. మేము ఆయనకు చేసిన అన్యాయం ఏంటని గంగమ్మ ప్రశ్నించారు.

Updated : 28 Jan 2023 19:29 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు