Hyderabad: ‘సీఐ నా బంధువు’.. నడిరోడ్డుపై మహిళ హల్‌చల్!

‘నా బంధువు సీఐ. నా కారునే డ్యామేజ్  చేస్తావా? చెప్పు తీసుకుని కొడతా!’.. అంటూ  హైదరాబాద్‌లో రాత్రివేళ నడిరోడ్డుపై ఓ మహిళ రచ్చ చేసింది. మీర్‌పేట్  సమీపంలోని టీకేఆర్‌ కమాన్ వద్ద ఓ కారు ఓవర్ టేక్ చేసే క్రమంలో పక్కనుంచి తగిలి.. ఆ మహిళ కారు స్వల్పంగా దెబ్బతింది. దీంతో కారులో ఉన్న మహిళ కిందకు దిగి హల్‌చల్ చేసింది. తాను కూకట్‌పల్లి సీఐ చంద్రయ్య బంధువునని.. తన కారునే డ్యామేజ్ చేస్తావా? అంటూ మరో కారులో ఉన్న వ్యక్తి చొక్కా పట్టుకుని లాక్కెళ్లి దాడి చేసింది. స్థానికులు వారిస్తున్నా వినకుండా అసభ్య పదజాలంతో నానా రచ్చ చేసింది. దీంతో కాసేపు ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

Published : 17 Oct 2022 09:42 IST

Hyderabad: ‘సీఐ నా బంధువు’.. నడిరోడ్డుపై మహిళ హల్‌చల్!

Tags :

మరిన్ని