Viral Video: కదులుతున్న బైక్‌పై నుంచి దూకేసిన యువతి..!

కర్ణాటక బెంగళూరు (Bengaluru)లో కదులుతున్న బైక్‌ ట్యాక్సీపై నుంచి ఓ యువతి దూకేసింది. రైడర్‌ ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో పాటు.. వెళ్లాల్సిన మార్గంలో కాకుండా దొడ్డబళ్లాపూర్ రోడ్డు వైపు బైక్‌ను తిప్పడంతో కిందకు దూకింది. ఈ ఘటనలో స్పల్ప గాయాలతో ఆమె బయటపడింది. స్థానికుల సాయంతో నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

Updated : 26 Apr 2023 13:29 IST

Tags :

మరిన్ని