AP News: పసికందుతో మహిళా వీఆర్వో తెగింపు.. అక్రమ మట్టి తరలింపు అడ్డగింత

అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలను.. ఓ మహిళా వీఆర్వో సాహసోపేతంగా అడ్డుకున్నారు. కృష్ణా జిల్లా పామర్రు మండలం పసుమర్రు పరిధిలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని.. పెద్ద మద్దాలి వీఆర్వో మీనాకు స్థానికులు సమాచారం అందించారు. దీంతో క్షణం ఆలోచించకుండా ఆమె తన పది నెలల పాపను.. వెంట తీసుకొని ద్విచక్రవాహనంపై వెళ్లారు. కొత్తూరులో మట్టిని అన్‌లోడ్‌ చేస్తుండగా.. వాహనాలను నిలిపేశారు. రెండు టిప్పర్‌లను సీజ్‌ చేసి.. తహసీల్దార్‌ ఆఫీస్‌కు తరలించారు. తర్వాత ఫైన్ కట్టించుకుని వాహనాలను విడిచిపెట్టారు.

Published : 07 Jun 2023 22:15 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు