గంగా నదిలో పతకాలను పారవేసే నిర్ణయంపై వెనక్కి తగ్గిన రెజర్లు

రెజ్లర్లు తమ పతకాలను గంగానదిలో పారవేసే నిర్ణయంపై వెనక్కి తగ్గారు. రైతు సంఘాల నేత నరేశ్‌ టికాయత్.. హరిద్వార్‌కు చేరుకొని రెజ్లర్లను సముదాయించారు. వారి వద్ద నుంచి పతకాలను టికాయత్ లాక్కున్నారు. ఐదు రోజులు వేచి ఉండాలని రెజ్లర్లకు టికాయత్ సూచించారు. నరేశ్ టికాయత్‌తో చర్చల అనంతరం రెజ్లర్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకునేందుకు 5 రోజుల గడువు విధించారు. లేనిపక్షంలో పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని రెజ్లర్లు హెచ్చరించారు.

Published : 30 May 2023 21:21 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు