One Day Police: పోలీస్‌ కావాలనే కోరిక ఇలా తీరింది.. సంతోషంలో క్యాన్సర్‌ బాధిత యువతి!

చివ్వెంల పోలీస్ స్టేషన్‌లో అరుదైన దృశ్యం అవిష్కృతమైంది. పోలీస్ కావాలన్న ఓ యువతి కోరిక తీరేందుకు.. సూర్యాపేట జిల్లా పోలీసులు సహకరించారు. క్యాన్సర్ బాధితురాలైన స్వాతి అనే యువతి కోరిక మేరకు స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశాలతో.. ఒక్కరోజు ఎస్సై (One Day Police)గా ఆమెను జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ నియమించారు. ఆమెకు అండగా ఉన్నామంటూ ఆత్మస్థైర్యాన్నిచ్చారు. 

Published : 07 Jun 2023 13:08 IST

మరిన్ని