Road Accident: అతివేగం తీసింది.. యువకుడి ప్రాణం..!

అతివేగం ఓ యువకుడి ప్రాణం తీసింది. కూకట్‌పల్లి పరిధిలోని వివేకానంద నగర్ ప్రధాన రహదారిలో ఈ ఘటన జరిగింది. బుధవారం రాత్రి ద్విచక్రవాహనంపై వేగంగా వచ్చిన ఓ యువకుడు స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపుతప్పి పడిపోయాడు. తీవ్రగాయాలైన యువకుణ్ని స్థానికులు ఆస్పత్రికి తరలించినా.. ప్రయోజనం లేకపోయింది. యువకుడి ప్రమాద దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. మృతుడిని ఎర్రగడ్డ ప్రేమ నగర్‌కు చెందిన కాడి ఆనంద్ కుమార్ (24)గా పోలీసులు గుర్తించారు. అతడు ఎస్బీఐ బ్యాంకులో క్లర్కుగా పని చేస్తున్నాడని చెప్పారు.

Updated : 15 Dec 2022 16:32 IST

Tags :

మరిన్ని