దిల్లీకి చేరిన బెల్లంపల్లి భారాస ఎమ్మెల్యే వివాదం.. NCWకి యువతి ఫిర్యాదు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య (Durgam Chinnaiah)పై ఆరోపణల దుమారం ఇంకా కొనసాగుతోంది. దుర్గం చిన్నయ్యపై తాజాగా జాతీయ మహిళా కమిషన్‌ (National Commission for Women)కు ఫిర్యాదు చేసినట్లు అరిజిన్‌ డెయిరీ భాగస్వామి తెలిపారు. ఎమ్మెల్యే వల్ల ప్రాణ హానీ ఉందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. కాగా, ఎమ్మెల్యేకు, అరిజిన్‌ డెయిరీ పాల సంస్థ ప్రతినిధులకు మధ్య గతంలో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపులతో పాటు ఎమ్మెల్యే తమపై అక్రమ కేసులు బనాయించారని సదరు యువతి ఆరోపించారు.

Updated : 29 May 2023 17:43 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు