YS Sharmila: మంత్రి హరీశ్‌ రావుపై వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు

తెలంగాణ ఉద్యమ సమయంలో హరీశ్‌ రావు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె మర్చిపోయినట్టు నాటకాలు ఆడారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఆమె నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. శ్రీకాంతా చారి అగ్గిపెట్టె తెచ్చుకొని అమరుడైతే.. హరీశ్‌ రావు అగ్గిపెట్టె మర్చిపోయి మంత్రి అయ్యారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతోందన్నారు. కేసీఆర్ కుటుంబం  డ్రామాలు ఆడుతోందని.. వారందరికీ ఆస్కార్ అవార్డులు ఇవ్వాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Published : 06 Dec 2022 17:06 IST

మరిన్ని