YS Sharmila: పట్టువీడని వైఎస్‌ షర్మిల.. 4 గంటలుగా నడిరోడ్డుపైనే దీక్ష

ప్రజాప్రస్థాన యాత్రకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో.. వైతెపా అధినేత్రి వైఎస్‌ షర్మిల హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ప్రజా సమస్యలను ఎత్తిచూపితే తమ పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం సైఫాబాద్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని లోటస్ పాండ్‌కు తరలించారు. దీంతో లోటస్‌ పాండ్‌లోని పార్టీ కార్యాలయం ముందే షర్మిల దీక్షకు దిగారు. మరోవైపు, 4 గంటలుగా రోడ్డుపైనే దీక్ష చేస్తున్న షర్మిలకు సంఘీభావం తెలిపేందుకు బయలుదేరిన.. విజయమ్మను ఇంటివద్దే పోలీసులు అడ్డుకున్నారు.

Updated : 21 Feb 2024 14:19 IST

Tags :

మరిన్ని