Viveka Murder Case: అవినాష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు ఉత్తర్వులు నిలిపివేత

వైఎస్‌ వివేకా హత్య కేసు (Viveka Murder Case)లో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తాత్కాలిక ఉపశమనం కల్పిస్తూ.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం కోర్టు (Supreme Court) పూర్తిగా పక్కనపెట్టింది. అవినాష్ రెడ్డి (Ys Avinash Reddy) విషయంలో తెలంగాణ హైకోర్టు అలాంటి ఉత్తర్వులు జారీ చేయాల్సింది కాదని స్పష్టం చేసింది. సీబీఐకి హైకోర్టు అలాంటి నిబంధనలు విధించడం సరైన చర్య కాదని పేర్కొంది. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్న సుప్రీం కోర్టు.. వివేకా హత్య కేసు విచారణ గడువును జూన్ నెలాఖరు వరకు పొడిగించింది.

Published : 24 Apr 2023 19:36 IST

Tags :

మరిన్ని