YSRCP: వైకాపా ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుపై యువకుడి ప్రశ్నల వర్షం

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును ఓ సాధారణ పౌరుడు తన ప్రశ్నలతో చుక్కలు చూపించారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పసుపల్లికి వెళ్లిన ఎమ్మెల్యేని ఊళ్లోకి రాకుండానే ఆపి మరీ గ్రామస్థులతో కలిసి నిలదీశారు. చాలా పద్ధతిగా, తప్పించుకోవడానికి వీల్లేకుండా రహదారుల సమస్యపై నిగ్గదీసి అడిగారు. నాలుగేళ్ల కాలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని కడిగి పారేశారు. ఎమ్మెల్యే అనుచరులు సదరు వ్యక్తిని ఆపే ప్రయత్నం చేసినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. చేసేది లేక పోలీసుల సహకారంతో ఎమ్మెల్యే చిట్టిబాబు అక్కడినుంచి వెళ్లిపోయారు.

Published : 03 Feb 2023 13:58 IST

Tags :

మరిన్ని