YSRCP: సీఎం జగన్‌ను తిట్టే మనస్తత్వం మాది కాదు: దుట్టా రామచంద్రరావు

సీఎం జగన్‌(CM Jagan)ను తిట్టే మనస్తత్వం తమది కాదని వైకాపా నేత దుట్టా రామచంద్రరావు అన్నారు. అందరం సరదాగా కూర్చుని మాట్లాడుకునే సమయంలో ఎవరు వీడియో రికార్డ్‌ చేశారో తెలియదని తెలిపారు. ఆ వీడియోలో అనకూడని మాటలు ఏమీ లేవని చెప్పారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో కలిసి తాను ప్రయాణం చేయబోనని.. అధిష్ఠానానికి గతంలోనే చెప్పానని ఆయన అన్నారు. అయితే వంశీతో గొడవపడొద్దని అధిష్ఠానం తనకు చెప్పిందని.. వారి మాటకే తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్‌లో.. తమ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

Updated : 02 Feb 2023 14:39 IST

Tags :

మరిన్ని