Chandrababu: ‘చంద్రబాబుతోనే అమరావతి అభివృద్ధి’.. వైకాపా నేత సెల్ఫీ వీడియో వైరల్‌

తెదేపా అధినేత చంద్రబాబు(Chandrababu)తోనే అమరావతి అభివృద్ధి చెందుతుందని వైకాపా(YSRCP) రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ మీరావాలి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన మీరా వలి వైకాపాలో క్రియాశీల నాయకుడు. శుక్రవారం రాత్రి గన్నవరం నుంచి హైదరాబాదు వెళ్లే విమానంలో ఆయన ప్రయాణించారు. తన పక్క సీట్లో ఉన్న చంద్రబాబునాయుడుతో కలిసి ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో కలిసి ఉన్న సెల్ఫీ వీడియో రికార్డ్ చేశారు. అది ఇప్పుడు వైరల్ గా మారింది. 

Published : 04 Feb 2023 13:11 IST

మరిన్ని