AP Special Status: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదు!: వైకాపా ఎంపీ చంద్రశేఖర్

భాజపాకు ఏపీతో అవసరం లేదని, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా (Special Status) కూడా ఇచ్చే పరిస్ధితి లేదని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ (Bellana Chandrasekhar) అన్నారు. ప్రత్యేక హోదాపై పార్లమెంటులో 21 మంది ఎంపీలు, 8 మంది రాజ్యసభ సభ్యులు పోరాటం చేస్తూనే ఉన్నామని తెలిపారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. 

Published : 29 May 2023 14:11 IST

Tags :

మరిన్ని