YSRCP: ఇంటికి కరెంటు కట్ చేశారంటూ వైకాపా మహిళా సర్పంచ్‌ కంటతడి

ఇంటికి కరెంటు కట్ చేశారంటూ ఎన్టీఆర్‌ జిల్లా విస్సన్నపేట మండలం పుట్రేలకు చెందిన వైకాపా సర్పంచి కారుమంచి స్వాతి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో కన్నీరుమున్నీరుగా విలపించడం చర్చనీయాంశమైంది. స్థానిక మండల పరిషత్  కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ మెర్సీ వనజాక్షి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో పుట్రేల సర్పంచి స్వాతి డిస్కం అధికారుల తీరును ప్రస్తావిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. నాలుగు నెలల బిల్లు ఒక్కసారే తీయడం వల్ల.. ఎక్కువగా వచ్చిందని, ఇటీవల తనిఖీల పేరిట వచ్చిన అధికారులు కరెంట్ కట్ చేశారని, తాము దళిత సామాజిక వర్గానికి చెందినవాళ్లమని చెప్పినా అధికారులు వినిపించుకోలేదని విలపించారు. 

Published : 26 Nov 2022 14:32 IST

Tags :

మరిన్ని