Crime News: హత్య కేసులో.. కన్నడ నటుడు దర్శన్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

ప్రముఖ కన్నడ సినీ నటుడు దర్శన్ తూగదీపా అరెస్టుకు దారి తీసిన హత్య కేసులో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి.

Published : 14 Jun 2024 19:04 IST

ప్రముఖ కన్నడ సినీ నటుడు దర్శన్ తూగదీపా అరెస్టుకు దారి తీసిన హత్య కేసులో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. హత్యతో సంబంధం ఉన్న నిందితులకు దర్శన్ రూ.30లక్షల ఇవ్వజూపినట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్యకు వాడిన రాడ్లు, కర్రలు, తాడు సహా ఘటనాస్థలిలో మద్యం బాటిళ్లు, సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేణుకాస్వామి తనకు అశ్లీల చిత్రాలు పంపించిన విషయాన్ని ప్రియుడు దర్శన్ దృష్టికి తీసుకువెళ్లకపోతే ఈ హత్య జరిగేది కాదని నటి పవిత్ర గౌడ పోలీసుల వద్ద విచారం వ్యక్తం చేశారు. 

Tags :

మరిన్ని