Nikhil: ఎన్డీయే కూటమి అభ్యర్థికి మద్దతుగా.. సినీ నటుడు నిఖిల్‌ ప్రచారం

బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎం.ఎం కొండయ్య ఎన్నికల ప్రచారంలో ఆయనకు మద్దతుగా సినీనటుడు నిఖిల్‌ సిద్దార్థ (Nikhil) పాల్గొన్నారు.

Updated : 25 Apr 2024 16:49 IST

బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి, ఎం.ఎం. కొండయ్య గురువారం అట్టహాసంగా నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయనకు మద్దతుగా సినీనటుడు నిఖిల్‌ సిద్దార్థ (Nikhil), తెదేపా, భాజపా, జనసేన శ్రేణులు భారీగా పాల్గొన్నారు. నిఖిల్‌కు ఎం.ఎం. కొండయ్య.. మామయ్య అన్న విషయం తెలిసిందే. మాట్లాడుతూ.. చిరు నవ్వుల చీరాల కావాలంటే కొండయ్యకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు.

Tags :

మరిన్ని