Nagastra-1: భారత సైన్యం చేతిలో ‘నాగాస్త్ర-1’

భారత సైన్యం అమ్ముల పొదిలోకి సరికొత్త అస్త్రం చేరింది. మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని సోలార్‌ ఇండస్ట్రీస్‌ అభివృద్ధి చేసిన ‘నాగాస్త్ర-1’ సైన్యం చేతికి వచ్చింది.

Updated : 15 Jun 2024 12:40 IST

భారత సైన్యం అమ్ముల పొదిలోకి సరికొత్త అస్త్రం చేరింది. మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని సోలార్‌ ఇండస్ట్రీస్‌ అభివృద్ధి చేసిన ‘నాగాస్త్ర-1’ సైన్యం చేతికి వచ్చింది. వైమానిక దాడుల నిమిత్తం వినియోగించే 480 నాగాస్త్రాలను సైన్యం ఆర్డర్‌ ఇవ్వగా.. వాటిలో తొలి విడతగా 120 అందాయి. జీపీఎస్‌ ఆధారంగా పని చేసే ‘నాగాస్త్ర-1’ రెండు మీటర్ల కచ్చితత్వంతో దాడి చేయగలదు. దీనిని ఆత్మాహుతి (సూసైడ్‌) డ్రోన్‌ అని కూడా పిలుస్తుంటారు. తొమ్మిది కిలోల బరువుండే ఈ డ్రోన్‌ సుమారు 4500 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు. రాడార్లకు దొరక్కుండా దాడులు చేయగలదు. దాదాపు గంటసేపు ఇది గాల్లో ఎగరగలదు. రాత్రి వేళల్లోనూ ఇది కచ్చితత్వంతో పనిచేయగలదు. అభివృద్ధి చెందిన దేశాల వద్ద ఉన్న డ్రోన్ల కంటే ఇది మరింత మెరుగైంది.

Tags :

మరిన్ని