Bhairava Anthem: ‘కల్కి’.. భైరవ ఆంథమ్‌.. ఫుల్‌ వీడియో వచ్చేసింది

    ‘కల్కి 2898 ఏడీ’ సినిమా నుంచి కొత్త పాట విడుదలైంది. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన చిత్రమిది.

Updated : 17 Jun 2024 15:12 IST

ప్రభాస్‌ (Prabhas) హీరోగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ రూపొందించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఈ నెల 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారంలో భాగంగా ‘ఒక నేనే.. నాకు చుట్టూ నేనే’ అంటూ సాగే పాటను ‘భైరవ ఆంథమ్‌’ (Bhairava Anthem) పేరుతో చిత్ర బృందం ఆదివారం విడుదల చేసింది. తాజాగా ఫుల్‌ వీడియోను అభిమానులతో పంచుకుంది. ప్రభాస్‌, గాయకుడు దిల్జీత్‌ దోసాంజ్‌లపై చిత్రీకరించిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకునేలా ఉంది. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్‌.. భైరవగా నటించారు.

Tags :

మరిన్ని