Purandeswari: కామారెడ్డిలో కేసీఆర్‌, రేవంత్‌రెడ్డిలపై భాజపా అభ్యర్థి విజయం అద్భుతం: పురందేశ్వరి

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు చరిత్రాత్మక తీర్పు వెల్లడించారని భాజపా ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari) అన్నారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రాల్లో భాజపాను సంపూర్ణంగా ప్రజలు ఆదరించారని అన్నారు.  విజయవాడ భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద మీడియాతో ఆమె మాట్లాడారు. తెలంగాణలోనూ భాజపాకు మంచి గౌరవం లభించిందని చెప్పారు. కామారెడ్డిలో కేసీఆర్‌, రేవంత్‌రెడ్డి లాంటి బలమైన ప్రత్యర్థులను ఓడించి.. భాజపా అభ్యర్థి వెంకటరమణారెడ్డి విజయం సాధించడం ఇందుకు నిదర్శనమన్నారు. (Telangana Assembly Elections)

Published : 03 Dec 2023 18:43 IST

Tags :

మరిన్ని