BJP: తిరుమల శ్రీవారి సేవలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

తిరుమల శ్రీవారిని భాజపా (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దర్శించుకున్నారు.

Published : 11 May 2024 11:54 IST

తిరుమల శ్రీవారిని భాజపా (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్థానిక భాజపా నేతలతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆయనకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ది చెందాలని, ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు నడ్డా తెలిపారు.

Tags :

మరిన్ని