Hyderabad: జవహర్‌నగర్‌లో కారు బీభత్సం.. భయాందోళనకు గురైన జనం

హైదరాబాద్ జవహర్‌నగర్‌లోని మసీదు గడ్డ ప్రాంతంలో.. ఓ కారు బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా వాహనాల పైకి కారు దూసుకెళ్లింది.

Published : 22 Jun 2024 12:30 IST

హైదరాబాద్ జవహర్‌నగర్‌లోని మసీదు గడ్డ ప్రాంతంలో.. ఓ కారు బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా వాహనాల పైకి కారు దూసుకెళ్లింది. భయాందోళనతో అక్కడ ఉన్న ప్రజలు పరుగులు తీశారు. ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

మరిన్ని